తెలంగాణ ప్రజలు అలర్ట్‌ : వ్యాక్సిన్‌ వేసుకుంటేనే బహిరంగ ప్రదేశాల్లో ఎంట్రీ !

-

ప్రస్తుతం ఒమిక్రాన్‌ అనే కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌ నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యంగా మాస్క్, వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు అమలు చేయాలని నిర్నయం తీసుకుంది. మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసు శాఖకు సూచించింది తెలంగాణ వైద్యశాఖ. ఇక నుంచి రాష్ట్రంలో ఎవరైనా…. మాస్క్ ఖచ్చిత0గా ధరించాలని తెలిపింది ప్రభుత్వం. అలాగే… బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని స్పస్టం చేసింది.

వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది సర్కార్‌. వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని వైద్య శాఖ తెలిపింది. హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం ఖచ్చితం చేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ కూడా తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేసింది కేసీఆర్‌ సర్కార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news