సి.ఆర్.డి.ఎ. కు కొత్త అర్ధం చెబుతున్న వైకాపా నేతలు!

-

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం చుట్టూ రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బాబు అన్నిరకాలుగా, అన్ని వర్గాలకూ, అన్ని పార్టీలకు కార్నర్ అయిపోతున్నారు! నాడు చేసిన తప్పులకో, పాపాలకో నేడు ఫలితం అనుభవిస్తున్నారన్న రేంజ్ లో కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మైకందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి!

అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలి.. మిగిలిన ప్రాంతాలు ఏమైపోయినా పర్లేదు అన్నరేంజ్ లో చంద్రబాబు ప్రవర్తన ఉందన్నట్లుగా చెబుతున్నా వైకాపా నేతలు… గ్యాప్ లేకుండా చంద్రబాబుపై ఫైరవుతున్నారు. ఈ క్రమంలో “చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు” అంటూ మొదలుపెట్టిన పార్థసారధి… రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉందని అటు కేంద్రం చెబుతున్నా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా కూడా టీడీపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని.. కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నారని ఫైరవుతున్నారు.

ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించిన పార్థసారధి… చంద్రబాబు అమరావతి కోసం 52 వేల కోట్ల రూపాయలు ఎక్కడ, ఎలా ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం, అవినీతి పనులకోసం “క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ”గా ఉన్న సి.ఆర్.డి.ఎ.” ను “చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ”గా మార్చేశారని పార్థసారథి ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news