ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరగనున్న అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. శుభ్‌మన్ గిల్‌కు కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే గిల్ ఇంగ్లాండ్ సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
అయితే గిల్‌కు అయిన గాయం తీవ్రమైంది కావడంతో అతనికి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం గిల్ ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఒకవేళ గిల్ సిరీస్ నుంచి వైదొలిగితే అతని స్థానంలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లో ఆడే అవకాశం ఉంది. అలానే గిల్ స్థానంలో స్టాండ్ బై ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాగా ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లాండ్‌ల 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. అలానే మొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగియడంతో ఈ సిరీస్‌తో రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. దీంతో ప్రతి మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.