నేటి నుండి కొత్త రూల్స్.. జేబులు చిల్లు పడచ్చు… చూసుకోండి..!

-

ప్రతీ నెలా కూడా కొన్ని కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి. వాటిని గమనిస్తూ ఉండాలి. లేదంటే ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మరి ఇక నేటి నుండి కొత్త నెల మొదలు అవుతోంది. మరి ఇక ఈ నెలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి అనేది చూసేద్దాం.

ఆధార్ కార్డు ఉన్న వారు వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం ఇస్తోంది. పేరు, అడ్రస్ వంటి వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఫ్రీగా అప్డేట్ చెయ్యచ్చు. ఈ అవకాశం జూన్ 14 వరకు మాత్రమే. ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా చేసినా రూ.50 పే చెయ్యాలి.
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్‌ చేసి క్లెయిమ్‌ చేసుకోని వారు కూడా వున్నారు. అలా క్లెయిమ్‌ చేయిని వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు కానీ నామినీలకు కానీ డబ్బులు అందించేలా చర్యలు చేపట్టింది. జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 1 నుంచి 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దీని ద్వారా అన్‌క్లెయిమ్డ్ అమౌంట్‌ను సెటిల్ చేస్తుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి జూన్ 1 నుంచి భారీ షాక్. కేంద్ర సర్కార్‌ అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత పడనుంది. సబ్సిడీని పరిమితి 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది.
పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లో డబ్బులు పెట్టచ్చు. కొత్త ఖాతా ఓపెన్‌ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చెప్పింది. జూన్‌ 15 నుంచి అమల్లోకి రానుంది.
అలానే జూన్ 30 వరకు ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్ లో చేరేందుకు అవుతుంది.
జూన్ 1 నుంచి భారత్ నుంచి ఎగుమతి చేసే అన్ని దగ్గు సిరప్‌లను తప్పనిసరిగా చెక్ చేయనున్నారు.డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news