తెలంగాణ విద్యాశాఖ ఇంటర్‌లో కొత్త కోర్సులకు శ్రీకారం చుడుతూ.. కీలక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయంగా వస్తున్న కోర్సులకు అదనంగా మరో ఆరు కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఇంటర్ బోర్డు ఉంది. అయితే.. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇంటర్ విద్యలో కొత్త కోర్సులు తీసుకువచ్చేందుక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టెక్నికల్, కామర్స్ కోర్సులకు పెద్ద పీట వేసేందుకు కసరత్తు చేస్తోంది విద్యాశాఖ.
అయితే.. డేటా అనాలసిస్, డేటా సైన్స్, నెట్ వర్కింగ్ పబ్లిక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ మెషిన్ లెర్నింగ్, మైనింగ్ సబ్జెక్ట్ ల కాంబినేషన్లో కొత్త కోర్సులను ఇంటర్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు పంపింది. త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుండి ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డ్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇంటర్ విద్యనుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తే… ఇంజనీరింగ్‌లో మరింత ప్రతిభావంతంగా విద్యార్థులు రాణించే అవకాశం ఉంది.