ఒక వ్యతిరేకత అనేక పాఠాలు నేర్పుతుందని అంటారు. ఇప్పుడు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పరిస్థితి కూడా అలానే తయారైందని అంటున్నారు పరిశీలకులు. విశాఖ టూర్ ఎఫెక్ట్‌తో ఆయన అంతరంగ మధనంలో పడ్డారని చెబుతున్నారు. విశాఖలో తనకు ఎదురు ఉండదని చంద్రబాబు భావించారు. పైగా.. కూడా తన పార్టీకి చెందిన నాయకులే.. విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించడంతో ఆయన ఇక, తన పర్యటనను ఎవరు ఆపుతారులే అనుకున్నారు. ఈ ధీమాతోనే చంద్రబాబు ఈ పర్యటనను ప్లాన్ చేసుకున్నారు.
అయితే, అనూహ్యంగా చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. స్థానికే కావొచ్చు.. లేదా టీడీపీ చెబుతున్న ట్టు.. అక్కడి వైసీపీ నాయకులు, కార్యకర్తలే కావొచ్చు.. వీరు కూడా ప్రజల్లో భాగమే కాబట్టి.. చంద్రబాబును అడ్డుకున్నారు. ఫలితంగా ఆయన విశాఖ పర్యటన నుంచి వెనుదిరిగి మళ్లక తప్పలేదు. మరి ఈ ప్రభావం అటు పార్టీపైనా.. ఇటు వ్యక్తిగతంగా చంద్రబాబుపైనా కూడా పడుతుందనడంలో సందేహం లేదు. మరి దీని నుంచి పార్టీని కాపాడడం ఎలా? నాయకుల్లో దైర్యం నూరిపోసేదెలా? అనే విషయాలపై చంద్రబాబు అప్పు డే మేధోమథనం ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు శనివారం ఈ పనిపైనే నిమగ్నమయ్యారని సమాచారం.
చంద్రబాబు ముందు ఇప్పుడు ప్రధానంగా రెండు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు టీడీపీ సీనియర్లు. ఒకటి.. విశాఖ పరిణామాలతో భవిష్యత్తులో ఇక్కడ పర్యటనను ఇప్పట్లో జరపకుండా వాయిదా వేసుకో వ డం. మరీ ముఖ్యంగా రాజధానిపై ఏదో ఒకటి తేలేవరకు ఆయన విశాఖ సహా ఉత్తరాంధ్ర పర్యటనకు దూ రంగా ఉండడం. రెండోది.. ఏదైనా జరగనీ.. తానేమైనా కానీ.. అంటూ విశాఖ సహా ఉత్తరాంధ్రలో పర్యటిం చడం. ఈ రెండు ఆప్షన్లలో పార్టీ పరంగా చంద్రబాబుకు మొదటిది కన్నా రెండో దే బెటర్.
కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత త్యాగం చేస్తే.. ఇబ్బందులు తప్పవు కదా? అంటున్నవారు కూడా ఉన్నారు. అలాగని మొదటి సలహాను పాటిస్తే.. మొదటికే మోసం వచ్చి..పార్టీ పరిస్థితే.. అగమ్యగోచరంగా మారుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఏ మార్గం అనుసరించాలనే విషయంపై ఆయన సీనియర్లతో మంతనాలు చేస్తున్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎలా ముందుకు సాగుతారో చూడాలి.