Breaking : న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్‌ రచ్చ షురూ..

-

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్‌ నెలకొంది. 2022కు గుడ్ బై చెప్పి.. 2023 న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ప్రపంచ దేశాలలోని ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల ప్రజలు న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పేశారు. అందరికంటే ముందుగా ఓషియానియా‌ న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పేసింది. ప్రపంచంలోని కొత్త సంవత్సరం ముందుగా ఓషినియాలో ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ న్యూ ఇయర్ ప్రారంభమైంది. చిన్న పసిఫిక్ ద్వీప దేశాలు టోంగా, కిరిబాటి, సమోవా‌లు కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి.

New Year's Eve LIVE: Millions ring in 2023 as celebrations kick off around  world - World News - Mirror Online

అంతేకాకుండా.. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్‌ జోష్‌ మొదలైంది. అక్కడి ప్రజలు మన కాలమానం ప్రకారం సాయంత్రం 4.45 గంటలకే 2023వ సంవత్సరానికి స్వాగతం పలికారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ సిటీలో ముందుగా న్యూ ఇయర్‌ సంబరాలు మొదలయ్యాయి. ఆక్లాండ్‌లో సమయం అర్ధారాత్రి 12.00 గంటలు కాగానే జనం కేరింతలతో నగరం మారుమోగింది. సిటీ అంతటా లైట్‌ షోలతో దగదగ మెరిసింది. రంగురంగుల పటాకుల మోత మోగింది. జనం అంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. డప్పుచప్పుళ్ల నడుమ డ్యాన్సులు చేశారు. ఆ సంబరాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news