పెళ్లికి ఇప్పుడు డెఫినేషన్ మారింది. ఒకప్పుడు అమ్మానాన్న, బంధువుల మధ్య ఎంత నిరాడంబరంగా జరుపుకున్నా.. అందరి ఆశీస్సులే ముఖ్యమని భావించేవారు. కానీ ఇప్పుడు పెళ్లికి ఎవరు వచ్చినా రాకున్నా.. మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా రకరకాల వేడుకలు జరుపుకుంటున్నారు. వివాహానికి ముందే అరడజను వేడుకలతో వధువు తండ్రి జేబు తడిసిపోతోంది. ఇవి చాలవన్నట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ వీటికి అదనం.
ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కొన్ని జంటలు చేసే వికృత చేష్టలు అప్పుడప్పు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. సముద్రం మధ్యలో, ఆకుల చాటులో, సెమీ న్యూడ్, బురదలో ఇలా చిత్రవిచిత్రాలుగా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అవీ తీసే వాళ్లకేమో గానీ చూసే వాళ్లకు మాత్రం చాలా చికాకుని కలిగిస్తున్నాయి. అయితే తాజాగా ఓ యువతి తన ప్రీవెడ్డింగ్ షూట్‌కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ అమ్మాయి ప్రీవెడ్ షూట్ కాస్త వినూత్నంగా అనిపించింది. అంతేకాదు ఆమె పెట్టిన పోస్ట్‌ను ఓ అమ్మాయి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ తన అత్తింటి వాళ్లకి ఓ స్వీట్ వార్నింగ్‌లా కనిపించింది. అదేంటో తెలుసుకుందామా..?
తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం వినూత్న రీతిలో.. వ్యాయామశాలలో బరువులెత్తుతూ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో పాల్గొనడం విశేషం. పెళ్లి కుమార్తెగా ముస్తాబైన ఆ యువతి.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సంయుక్త అనే ట్విటర్ యూజర్ సదరు వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘భర్త, అత్తింటివారికి ఇదో స్పష్టమైన హెచ్చరిక?’ అంటూ సరదా వ్యాఖ్యలు జోడించారు. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘అత్తింటివారి పనైపోయింది’, ‘ఇకపై వారు చుక్కలు చూస్తారు’ అంటూ నెటిజన్లు సైతం అంతే సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Pre-wedding photo shoot! Clear message to husband and in-laws??😀😅 pic.twitter.com/Njq0RjJXlc
— Samyuktha (@Samgurltweetz) August 28, 2022