అయ్యబాబోయ్: టోల్ గేట్ చార్జీలు పెంపు… ఏ వాహనాలకు ఎంతెంత అంటే ?

-

దేశంలో జాతీయ రహదారులు ఎంత ముఖ్యమో తెలిసిందే. వీటిని సక్రమంగా నిర్వహించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అన్ని చర్యలను తీసుకుంటూ ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా చూసుకుంటూ ఉంటుంది. కాగా హైవే లలో అక్కడక్కడా టోల్ గేట్స్ ఉంటాయి. వీటిని ధాటి వెళ్లాలంటే వెహికల్ కేటగిరీ ని బట్టి రుసుమును చెల్లించాలి. టోల్ గేట్ చార్జెస్ ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఒకసారి పెంచడం జరుగుతుంది. అదే విధంగా 2022 – 2023 ఆర్ధిక సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగియనుంది.

కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరిగిన టోల్ చార్జీలు అందుబాటులోకి రానున్నాయి. అయితే హైవే ఆథారిటీస్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం టోల్ చార్జెస్ 5 నుండి 10 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా లైట్ వెయిట్ వాహనాలకు 5% మరియు భారీ వాహనాలకు 10 % చొప్పున పెరిగే అవకాశం ఉంది. అవి ఎంత మాత్రం అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news