వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనపై జరిగిన థర్డ్ డిగ్రీ జాతీయ స్థాయిలో సంచలనం అయింది. సుప్రీం కోర్ట్ కూడా ఆయనపై థర్డ్ డిగ్రీ జరిగింది అనే అభిప్రాయానికి రావడంతో కొట్టారు అనేది స్పష్టం అయింది. ఇక ఇదిలా ఉంటే ఎంపీ రఘురామ అరెస్ట్ తీరుపై ఎన్‌హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది.
4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి అంతర్గత విచారణకు ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. జూన్ 7 లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్ఆర్సీ డీజీకి ఆదేశం ఇచ్చారు. రఘురామ అరెస్ట్ తీరుపై ఎన్‌హెచ్ఆర్సీకి కుమారుడు భరత్ ఫిర్యాదు చేయగా… స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.