ఫస్ట్ కాజ్ : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జీవితం ఇది…ఫాదర్స్ డే సందర్భంగా..ఆమె జీవితాన్ని మేలి మలుపు తిప్పిన నాన్నకు జేజేలు చెప్పండి మీరు…
ప్రపంచాన్ని శాసించే విజయాలు తెలుగు నేల నుంచి వచ్చిన బిడ్డలు ఇచ్చారు. ఆ బిడ్డలు నాన్న భుజాలపై జీవితాన్ని ఉంచారు. ఆ బిడ్డలు నాన్న అడుగులకు అడుగులు అయి ఉన్నారు. నాన్న బాధ్యతలు పెంచి తమ బాధ్యతలు దీక్షగా నిర్వర్తించి ఉన్నారు. ఆ బిడ్డలకు మనం జేజేలు పలకాలి. తెలంగాణ వాకిట బిడ్డలు.. ఆ బిడ్డలకు వందనాలు చెల్లించాలి. నిఖత్ ఒక్కరే కాదు ఆ ప్రయాణంలో ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్రాక్టీసు చేస్తున్న మరో చిన్నారి (ఆమె చెల్లి) కూడా ఉన్నారు. నాన్నకు
ఆ ఆడబిడ్డలు ఆ ముగ్గురు బిడ్డలు ఎంతో గర్వకారణం. బిడ్డల ఎదుగుదలకు ఆ నాన్న కష్టం ఇప్పుడు స్మరణలో ఉంది. ఆ బిడ్డల గెలుపు నుంచి మనం ఏమయినా నేర్చుకుని తీరాలి. ఓటమి నుంచి పక్కకు తప్పుకోని నాన్నకు మనం సెల్యూట్ చేయాలి. ఈ దేశానికి వీరే కావాలి. ఈ తెలంగాణ నేల విజేతల కార్ఖానా కావాలి.
విజేతలను ఎవరో ఒకరు పరిశీలిస్తారు. ప్రామాణికం అయిన ఆనందాలే అందుకుని ఉంటారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ జీవితం వేరు. ఆమె కు ఇప్పుడు హరతులు పడుతున్న వారికి నిన్నటి రోజులు గుర్తుకురావాలి. ఆటల్లో ఓడిపోయిన రోజులు కొన్ని ఆమెను వెన్నాడితే…. అవమానాలు కొన్ని… ఆమెను మరికొన్ని రోజులు వెన్నాడాయి. బాధలేదు. నాన్న ఉన్నాడు. ముగ్గురు ఆడపిల్లల నాన్నకు అన్నీ తెలుసు. లోకం విధించే సంప్రదాయాలు పాటిస్తూనే బిడ్డలను ఎంతో ఉన్నత స్థితికి చేర్చారాయన. ఓ గొప్ప నాన్న ఆయన. పేరు జమీల్ హైమద్.
నీవు బాగా ఆడాలి అని చెప్పడం సులువు. నీ ఆటకు నా దగ్గర డ బ్బులేదు ఆడవద్దు అని చెప్పి ఆపేయ్యడం సులువు. కానీ ఆ తండ్రి ఈ రెండు పనులూ చేయలేదు. దేశానికి బాధ్యత గల ఇలాంటి తండ్రులు కావాలి సర్.. అప్పుడు బిడ్డలు విజేతలు అవుతారు. జగజ్జేతలు అయి పుట్టిన నేలకు గొప్ప వరాలు తెస్తారు. ఖ్యాతి ఇస్తారు. నాన్న ఎన్నో బాధలు చూశారు. నీవు ఓడిపోయావా అని నిరాశ చెందనివ్వని నాన్న కు ఆ బాక్సర్ ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు. తెలంగాణ వాకిట నిజామాబాద్ దారుల్లో వెలిగిన కిరణం నిఖత్.. మీకు ఇలాంటి వారు పరిచయం కావాలి ఈ ఆదివారం. మీరు బాగా తెలుసుకుని రాణించాలి.. ఓ యువకులారా! మీరు ఈ దేశం ఖ్యాతిని పెంచాలి. అందుకు నిఖత్ లాంటివారే మీకు ఆదర్శం.
బిడ్డలు ఓడిపోయినా,గెలిచినా వెన్నంటే తండ్రులకు పాదాభివందనాలు చేయాలి. దేశానికి కీర్తి ఒక్కటే కాదు ఆత్మవిశ్వాసం పెంపొందించే తండ్రులు కావాలి. ఆడ బిడ్డల ఎదుగుదలకు తమ జీవితాన్నే త్యాగం చేసిన తండ్రులు కావాలి. ఎవ్వరైనా చేయాల్సింది ఇదే కదా! బాధలున్నా,ఇబ్బందులున్నా, అవమానాలున్నా నిఖత్ విజయాలకు అవి ఆటంకం కాలేదు.
వైజాగ్ శాప్ లో శిక్షణ తీసుకున్న రోజుల నుంచి హైద్రాబాద్ లో శిక్షణ పొందిన రోజుల వరకూ ఈ తెలుగు నేల ఆమెను చూసి గర్వి స్తోంది. దేశానికి ఇటువంటి బిడ్డలే కావాలి. విజేతలు కావాలి వీరులు కావాలి.. ఈ ఫాదర్స్ డే ఒకింత ఆనందాలను అటువంటి తండ్రులకు కాస్త ఎక్కువగానే అందించాలి.