నిఖిల్‌ స్పై మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

-

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’ ఇప్పటిక ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే వెల్లడించింది. ఈ సినిమాలో నిఖిల్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలపడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ప్రస్తుతం నిఖిల్‌ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘స్పై’ ఒకటి.ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ చేశాయి.

Nikhil Siddhartha starrer Spy to release on June 29; makers to drop teaser  on May 12 : Bollywood News - Bollywood Hungama

తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన రెండు బిగ్‌ అప్‌డేట్‌లను ప్రకటించారు. ఈ సినిమాను జూన్ 29న పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఈ సినిమా టీజర్‌ను మే 12న రిలీజ్‌ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. కార్తికేయ2 తర్వాత వస్తున్న మరో నేషనల్‌ థ్రిల్లర్‌ అని, స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు వీడియోలో తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news