ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని ఎన్నికల కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. అయితే మంత్రులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రభుత్వ అధికారులు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బంది మాత్రమే అనుసరించాలని స్పష్టం చేశారు. అలానే ఆ సమయంలో ప్రభుత్వం వాహనాలు ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాల్లో వెళ్లొద్దని ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ ర్యాంక్ లో ఉన్న ప్రభుత్వ సలహాదారులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రభుత్వ వాహానాలను ఉపయోగించొద్దని , కేబినెట్ ర్యాంక్ లో ఉన్న ప్రభుత్వ సలహాదారులు పత్రికా సమావేశాల కోసం ప్రభుత్వ వాహానాలు, ప్రభుత్వ భవనాలను వినియోగించకూడదని ఆదేశించారు. ఈ విధంగా చేయక పోతే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, 1994 పంచాయతీరాజ్ చట్టం, 1951 ప్రజా ప్రాతినిధ్యం చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టేనని కమిషనర్ పేర్కొన్నారు.