Breaking : నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ

-

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్ నుంచి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. తనను భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. అయితే, నీరవ్ మోదీ పిటిషన్ ను జస్టిస్ జెరెమీ స్టూవర్ట్ స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ధర్మాసనం తోసిపుచ్చింది. తన మానసిక స్థితి సరిగా లేదని, తనను భారత్ కు అప్పగిస్తే ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంటానేమోనని నీరవ్ మోదీ పేర్కొనగా… నిజమే కావొచ్చు… కానీ మీలాంటి వాళ్లను ఎలా చూసుకోవాలో జైలు అధికారులకు బాగా తెలుసు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

नीरव मोदी को भारत प्रत्यर्पित किए जाने का रास्ता साफ, ब्रिटिश सुप्रीम कोर्ट  में अपील की नहीं मिली अनुमति - nirav modi petition against extradition to  india rejected

అంతేకాదు, ఈ పిటిషన్ వేసినందుకు గాను మోదీ న్యాయపరమైన ఖర్చుల కింద రూ.1.5 కోట్లు చెల్లించాలిని ఆదేశించారు. కాగా, లండన్ హైకోర్టు తాజా తీర్పుతో నీరవ్ మోదీకి అన్నిదారులు మూసుపోయినట్టే. నీరవ్ మోదీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం నేటితో ఆవిరి కాగా, ఆయనను బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు అప్పగించడం లాంఛనమే కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.11 వేల కోట్లకు టోకరా వేసినట్టు నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news