Breaking : సీఎం కేసీఆర్‌పై కొండా సురేఖ సీరియస్

-

తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని కేసీఆర్ దేశ రైతులను ఉద్దరించడానికి వెళ్తున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తే అవన్ని మట్టి కొట్టుకుపోయాయని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఆ తర్వాత దేశంలో తిరుగుతారో సముద్రంలో దూకుతారో మాకు సంబంధం లేదన్నారు.

Konda Surekha: సీబీఐ భయంతోనే కవిత 'జాగృతి' నినాదం | Konda surekha Hot  comments on MLC Kavitha

ఓ పక్క కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాంలో మరో పక్క కుమారుడు కేటీఆర్ గ్రానైట్ దందా, కబ్జాలు, సెటిల్ మెంట్లు చేస్తుంటే మరో పక్క కేసీఆర్ దేశాన్ని ఏలడానికి ఇతర రాష్ట్రాల్లో మీటింగులు పెడతానని హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందు మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆ తర్వాత దేశంలో తిరుగుతారో లేక హిందూ మహాసముద్రంలో దూకుతారో మాకు సంబంధం లేదన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత అభద్రతా భావంతో తన తండ్రి వెంటే ఉంటోందని, రాబోయే రోజుల్లో కవితను సీఎం చేయబోతున్నాడా అనే అనుమానం తనకు కలుగుతోందన్నారు. అందువల్లే కేటీఆర్ ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్ కు వెళ్లలేదని అన్నారు. కవితను అరెస్ట్ చేస్తారనే భయంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటారని బీఆర్ఎస్ వెనుక కూడా ఏదో ఒక దురుద్దేశం ఉండే ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news