కరోనాకు కేంద్ర బడ్జెట్ ఇదే, పేదలకు తక్షణమే డబ్బులు జమా…!

-

కేంద్ర ప్రభుత్వం భారీ కరోనా ప్యాకేజిని ప్రకటించింది. ఒక లక్షా 70 వేల కోట్లతో ఈ ప్యాకేజిని కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మూడు కోట్ల మంది పేద వృద్దులకు ఎక్స్ గ్రెషియా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారు అందరికి కూడా ఆర్ధిక సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. పేదలు కూలీల కోసం ఆర్ధిక సాయం చెయ్యాలని కేంద్రం భావిస్తుంది. ఆకలి కేకలు లేకుండా చేసే విధంగా అడుగులు వేసింది.

ఈ మేరకు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసారు. 8.69 కోట్ల మంది రైతులకు కిసాన్ యోజన కింద తక్షణమే రెండు వేలు ఆర్ధిక సహాయం. 8౦ కోట్ల మందికి ఉచితంగా 5 కేజీలు బియ్యం లేదా గోధుమలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు. కరోనాతో పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి 50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. వచ్చే మూడు నెలలు రేషన్ తో పాటు అదనంగా కేజీ కంది పప్పు ఇవ్వనున్నట్టు ఆమె వివరించారు.

ప్రధాని ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలెండర్లు మూడు నెలలు ఫ్రీ గా ఇస్తామని నిర్మల ప్రకటించారు. 15 వేలు లోపు జీతం ఉన్న వారికి ఈపీఎఫ్ లో భాగం ఇస్తామని చెప్పారు. మూడు నెలల పాటు ఈపీఎఫ్ లో 24 శాతం వాటా కేంద్రమే ఇస్తుందని చెప్పారు. ఉపాధి హామీ కూలీ 182 నుంచి 202 కి పెంచుతున్నామని అన్నారు. 20 కోట్ల మంది మహిళలకు మూడు నెలలకు మూడు నెలల పాటు నెలకు 500 ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.

7 కోట్ల స్వయం సహాయక బృందాలకు 20 లక్షల రుణ సదుపాయం చెల్లిస్తామని అన్నారు. గరీబ్ కళ్యాణ్ స్కీం పేరుతో కేంద్రం ఈ ప్యాకేజిని ప్రకటించింది.భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్రాలు 30 వేల కోట్లు వాడుకునే వెసులుబాటు ఇస్తున్నామని చెప్పారు. వితంతువులు, దివ్యాంగుల కోసం మరో వెయ్యి అదనంగా ఎక్స్ గ్రెషియా ఇస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news