మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. భారత ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలను చూస్తే.. 9 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 45 యేళ్లకు మించకుండా వున్నవాళ్లు మాత్రమే అర్హులు. మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, మ్యాథ్స్, ఇంగ్లీష్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి.
ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ప్యాస్ అయ్యి ఉండాలి. అలానే టీచింగ్/రీసెర్చ్ అనుభవం ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 14, 2022. రూ.1000 అప్లికేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వుంది. ఈ కింది చిరునామాకు అప్లికేషన్ ని పంపాల్సి వుంది. పూర్తి వివరాలను https://www.nitttrc.ac.in/recruitmentasp.php#top లో చూడచ్చు.
చిరునామా: The Director, National Institute of Technical Teachers Training and Research (NITTTR), Taramani, Chennai 600 113, Tamilnadu, India.