నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను అంతకంతకు తీవ్రరూపం దాల్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో తుఫాను ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో అని అందరూ వణికిపోయారు. తుఫాను తీరం దాటడంతో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీవ్ర స్థాయిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షం పడుతుందేమో అనేంతగా పూర్తిగా వాతావరణం చల్లబడి పోయింది.. దీంతో తీవ్ర తుఫాను మరింత నష్టం కలిగిస్తుంది అని అందరూ బెంబేలెత్తి పోయారు.
కాగా ఇటీవలే తుఫాను తీవ్రత క్రమక్రమంగా తగ్గుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు గుర్తించారు అతి తీవ్రంగా ఉన్న తుఫాను నుంచి ప్రస్తుతం తీవ్రంగా ఉన్న తుఫానుగా మారింది అని ఇక రానున్న ఆరు గంటల్లోనే తుఫాను తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది వాయువ్య దిశగా కదిలి కర్ణాటక వైపు తుఫాన్ వెళ్లే అవకాశం ఉందని దీంతో కర్ణాటకలోని తీరప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అదే ప్రమాదం పూర్తిగా తొలగినట్లు కాదని తుఫాన్ లో కొంత భాగం ఇంకా సముద్రం లోనే ఉంది అంటూ చెప్పుకొచ్చారు వాతావరణ శాఖ అధికారులు.