ఇక దిల్ రాజు హీరో విజయ్ నటిచిన వారీసు సినిమా ఈ రోజు తమిళనాడు లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లు పెట్టి మరీ భారీ ఎత్తున తీశారు.ఇక వారసుడును తెలుగు లో ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా తెర వెనుక మంత్రాంగం నడిచి 14 కు వాయిదా పడింది.కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా అలాగే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా లు ఉండటం వల్ల వెనక్కి వెళ్ళింది.
కాని తమిళంలో ఈ రోజు రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. దిల్ రాజు తో పాటు సినిమా యూనిట్ సిబ్బంది చెన్నై లో ఓ థియేటర్ లో సినిమా చూస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఉత్సాహం.. అభిమానం.. వరిసు చిత్రానికి అభిమాను నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి థియేటర్లలో బాగా ఎమోషనల్ గా అయ్యారు. కాక పోతే ఈ సినిమా తెలుగు లో ఆడే అవకాశం లేదని తమిళంలో చూసిన ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది సెంటిమెంట్ పిండేసే సినిమా అని ఇలాంటి పిండుడు తెలుగు లో చాలా చూశామని ప్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మనకు ధమాకా లాంటి ఎంటర్టైనర్ కావాలని అంటున్నారు.ఇది చూసి తెలుగులో మాత్రం వారసుడు డౌటే అంటున్నారు. మరి వారసుడు తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. అదీగాక సినిమాకు తెలుగులో సరైన ప్రమోషన్స్ చేయకపోవడం కూడా తెలుగులో సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. దీనితో దిల్ రాజు కు తెలుగు మార్కెట్ మైనస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.