పసిడికి బ్రేక్… ధరలు వివరాలు ఇవే..!

-

ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ కొన్ని రోజుల నుండి కూడా ధరలకు బ్రేక్ పడింది. కేవలం ఒక్క చెన్నైలో మాత్రమే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. మిగిలిన చోట్ల లో మాత్రం మార్పు లేదు. ఆదివారం బంగారం ధరలు తటస్థంగానే ఉన్నాయి. ఇక బంగారం ధరలు కోసం పూర్తిగా చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం రూ.46,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం 47,000 ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,930 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,830 గా వుంది. అదే ముంబైలో అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,000 వద్ద వుంది.

ఇక చెన్నై లో అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,050 గా ఉంది. బెంగళూరు లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. విశాఖపట్నం లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 ఉంది, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,750 వద్ద వుంది. విజయవాడ లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news