కొడాలి ప్రత్యర్ధికి నో క్లారిటీ? బాబు ప్లాన్ ఏంటి?

-

ఏపీలో బలమైన నేతల్లో మంత్రి కొడాలి నాని ముందువరుసలో ఉంటారని చెప్పొచ్చు.. ఇక కొడాలికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అలాగే ఈయన, చంద్రబాబుపై చేసే విమర్శలు ఎలా ఉంటాయో కూడా అందరికీ తెలిసిందే.. తనదైన శైలిలో బాబుపై విరుచుకుపడతారనే సంగతి తెలిసిందే.. జగన్ పై గాని, తమ ప్రభుత్వంపై గాని విమర్శలు చేస్తే కొడాలి వెంటనే రియాక్ట్ అవుతారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు.. అవసరమైతే పరుష పదజాలంతో దూషిస్తారు..ఇక ఆయన మాటలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు.

ఇలా మాట్లాడతారు కాబట్టే కొడాలి అంటే తెలుగు తమ్ముళ్ళకు బాగా కోపం.. అసలు నాని పేరు చెబితే చాలు తమ్ముళ్ళు ఫైర్ అయిపోతుంటారు.. అయితే ఇలా తమ అధినేతని ఎడాపెడా తిడుతున్న కొడాలికి చెక్ పెట్టాలని టీడీపీ శ్రేణులు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. అయితే మాటలతో కంటే కొడాలికి రాజకీయంగా చెక్ పెట్టడం బెటర్ అని భావిస్తున్నారు.

అంటే కొడాలిని తన సొంత నియోజకవర్గం గుడివాడలోనే ఓడించాలని చూస్తున్నారు.. మామూలుగా గుడివాడ టీడీపీకి కంచుకోటే.. అది 2009 వరకు మాత్రమే, ఆ తర్వాత కొడాలి టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళాక సీన్ మారిపోయింది.. పూర్తిగా గుడివాడ వైసీపీ అడ్డా మారింది.. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కొడాలి గెలిచారు.. టీడీపీ ఏ మాత్రం కొడాలికి పోటీ ఇవ్వలేకపోయింది.. కానీ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గుడివాడలో కొడాలికి చెక్ పెట్టాలని చూస్తుంది..కాకపోతే టీడీపీ.. కొడాలికి చెక్ పెట్టే సత్తా ఉందా? అంటే లేదనే చెప్పాలి. పైగా టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు..పెద్దగా యాక్టివ్ గా పనిచేయడం లేదు. దీంతో గుడివాడలో టీడీపీ శ్రేణులు దూకుడుగా లేవు.. పార్టీకి కూడా బలంగా కనిపించడం లేదు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కుతుందో లేదో అనే క్లారిటీ లేకపోవడం వల్ల రావి సైలెంట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబు గుడివాడ సీటుని త్వరగా తేలిస్తే బెటర్..అయితే రావికి లేదంటే వేరే నేతకు కేటాయించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news