క‌రోనా వ్యాక్సిన్ టెస్టు కోసం వాలంటీర్‌గా ఎలా మారాలి ? అందుకు అర్హ‌త‌లేమిటి ?

-

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. అనేక చోట్ల ఫేజ్ 2, 3 ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. ర‌ష్యా ఇప్ప‌టికే ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్‌ను పూర్తి చేసి ఆగ‌స్టు 12న వ్యాక్సిన్‌ను ప్ర‌జా పంపిణీకి సిద్ధం చేస్తోంది. అయితే క‌రోనా వ్యాక్సిన్‌కు గాను ట్ర‌య‌ల్స్‌లో వాలంటీర్ల‌కు ఆ వ్యాక్సిన్‌ను ఇచ్చి టెస్టు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రి ఎవ‌రైనా అలా వాలంటీర్‌గా మార‌వ‌చ్చా ? అందుకు ఏం చేయాలి ? ఏ అర్హ‌త‌లు ఉన్న‌వారు వ్యాక్సిన్ టెస్టుకు వాలంటీర్లుగా మార‌వ‌చ్చు ? అంటే..

how to participate in vaccine trials who are eligible

క‌రోనానే కాదు.. ఏ వ్యాక్సిన్ టెస్టు‌కైనా స‌రే.. ఆరోగ్యవంత‌మైన వ్య‌క్తులు వాలంటీర్లుగా మార‌వ‌చ్చు. అందుకు ప్రత్యేక‌మైన అర్హ‌త‌లు అంటూ ఏవీ ఉండ‌వు. కాక‌పోతే వాలంటీర్లు 12 నుంచి 65 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సులో ఉండాలి. అలాగే ఆరోగ్య‌వంత‌మైన వారు అయి ఉండాలి. ఏ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌కూడ‌దు. మ‌హిళ‌లు కూడా వ్యాక్సిన్ల టెస్టు కోసం వాలంటీర్లుగా మార‌వ‌చ్చు. కాక‌పోతే వారు వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ స‌మ‌యంలో గ‌ర్భ నిరోధ‌క మాత్ర‌ల‌ను వాడాలి.

ఇక వ్యాక్సిన్ టెస్టుల‌ను స‌హ‌జంగానే ఏదైనా మెడిక‌ల్ కాలేజీ లేదా హాస్పిట‌ల్‌లో చేస్తారు. అందువ‌ల్ల ఆ ట్ర‌యల్స్‌లో పాల్గొనాల‌ని ఆసక్తిగా ఉంటే ఎవ‌రైనా స‌ద‌రు కాలేజీ లేదా హాస్పిట‌ల్ ప్ర‌తినిధుల వ‌ద్ద‌కు వెళ్లి ట్ర‌య‌ల్స్‌లో పాల్గొనేందుకు త‌మ అంగీకారాన్ని తెల‌పాలి. దీంతో వారు వాలంటీర్ల‌కు అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. పూర్తిగా ఆరోగ్య‌వంతులు అయితే వారిని వాలంటీర్లుగా ఎంపిక చేస్తారు. అనంత‌రం వారికి వ్యాక్సిన్ ఇస్తారు. త‌రువాత ట్ర‌య‌ల్స్‌లో నిపుణులు సూచించిన మేర వాలంటీర్లు న‌డుచుకోవాలి.

ట్ర‌య‌ల్స్‌లో పాల్గొనే వాలంటీర్లను వైద్యులు, సైంటిస్టులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుంటారు. వారి జీవ‌న‌శైలి ఎలా ఉంది.. వ్యాక్సిన్ ఇచ్చాక వారిలో ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయా.. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి.. వ్యాక్సిన్ ఎలా ప‌నిచేస్తుంది.. త‌దిత‌ర అన్ని వివ‌రాల‌ను వారు ఎప్ప‌టిక‌ప్పుడు వాలంటీర్ల‌ను ప‌రిశీలించి తెలుసుకుంటారు. అనంత‌రం వాటిని త‌మ రికార్డుల్లో న‌మోదు చేస్తారు. అలా ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతాయి.

వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత వాలంటీర్లు నిపుణులు సూచించిన మేర న‌డుచుకోవాలి. వారు చెప్పిన విధంగా జీవ‌న‌శైలిని పాటించాలి. ట్ర‌య‌ల్స్ కొన‌సాగినంత కాలం వారు నిపుణుల సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి. త‌రువాత ట్ర‌య‌ల్స్ ముగిస్తే.. వాలంటీర్లు త‌మ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఉండ‌వచ్చు. అయితే ట్ర‌య‌ల్స్ లో పాల్గొనేముందు వాలంటీర్లచే సంత‌కం త‌ప్ప‌క తీసుకుంటారు. త‌మ పూర్తి ఇష్టంతోనే ట్ర‌య‌ల్స్‌లో పాల్గొంటున్న‌ట్లు వారు సంత‌కం పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఆరోగ్య‌వంత‌మైన వారు ఎవ‌రైనా స‌రే.. వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొన‌వ‌చ్చు. అందుకు ప్ర‌త్యేక‌మైన నిబంధ‌న‌లంటూ ఏవీ ఉండ‌వు.

అయితే వ్యాక్సిన్ తీసుకున్నాక కొంద‌రికి తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌చ్చు. కొంద‌రిలో అస‌లు ఏ సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపించ‌క‌పోవ‌చ్చు. కొంద‌రికి ప్రాణాపాయ స్థితి సంభ‌వించ‌వ‌చ్చు. అందుక‌ని ట్ర‌య‌ల్స్‌లో వాలంటీర్‌గా పాల్గొనేముందు ఉండే రిస్కుల‌ను కూడా ఒక‌సారి గ‌మ‌నించాలి. ఆ త‌రువాత అందుకు ముందుకు సాగాలి..!

Read more RELATED
Recommended to you

Latest news