తెలంగాణలో ఆరోగ్య ఉపకేంద్రాల కొత్త భవనాలకు నిధులు విడుదల : మంత్రి ఎర్రబెల్లి

-

తెలంగాణలో 485 కొత్త స‌బ్‌సెంట‌ర్లు, 206 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు మ‌ర‌మ్మతులు, 43 పీహెచ్​సీలకు కొత్త భవనాల నిర్మాణాలను పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం 203 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.గడవులోగా పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆ పనులు పంచాయతీరాజ్ శాఖకు అప్పగించినట్లు చెప్పారు.

అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన మంత్రి..నిధులు విడుదల చేసినందున ఈనెల 9లోగా టెండర్లు పిలిచి డిసెంబర్‌నాటికి పనులు పూర్తిచేయాలని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్త భవనానికి కోటిన్నర సబ్‌సెంటర్ నిర్మాణానికి 20 లక్షల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం విడుద‌ల చేసిన నిధుల్లో మిగిలిన మొతాన్ని ఆ విధంగా వినియోగించుకోవాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news