నో డౌట్….షర్మిలకు తొలి ఓటమి కూడా అక్కడ నుంచే…

-

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ద్వారా వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూకుడు కనబరుస్తున్నారు. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల, కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతూనే ఉన్నారు. మొన్నటివరకు తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని దీక్షలు చేస్తూ హడావిడి చేసిన షర్మిల…ఇప్పుడు దళితులకు కే‌సి‌ఆర్ అన్యాయం చేసారంటూ దళిత భేరి సభల ద్వారా ముందుకెళుతున్నారు. దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Sharmila
Sharmila/షర్మిల

తాజాగా ఆమె తుంగతుర్తి నియోజకవర్గంలో దళితభేరి సభ నిర్వహించారు. ఇక ఇదే సభలో తుంగతుర్తిలో పోటీ చేసే వైఎస్సార్టీపీ అభ్యర్ధిని కూడా ప్రకటించేశారు. వైఎస్సార్టీపీలో కీలకంగా పనిచేస్తున్న నాయకుడు, తెలంగాణ జానపద గాయకుడు ఏపూరి సోమన్నను తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తెలంగాణలో వైఎస్సార్టీపీ తరుపున ప్రకటించిన అభ్యర్ధి సోమన్న.

అయితే సోమన్నకు తుంగతుర్తిలో గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? షర్మిల ఏ స్ట్రాటజీతో సోమన్నని తుంగతుర్తిలో నిలబెడుతున్నారు? అనే అంశాలని పరిశీలిస్తే…ఇప్పుడున్న రాజకీయ పరిస్తితుల్లో తెలంగాణలో షర్మిల పార్టీ సత్తా చాటడం చాలా కష్టమని తెలుస్తోంది. టి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య వైఎస్సార్టీపీకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు తుంగతుర్తిలో సోమన్నకు గెలిచే అవకాశాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే ఇక్కడ టి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికలు అంటే 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ టి‌ఆర్‌ఎస్ తరుపున గాదరి కిషోర్..కాంగ్రెస్ తరుపున అద్దంకి దయాకర్‌లు పోటీ చేస్తున్నారు. రెండుసార్లు అద్దంకి….గాదరిపై చాలా స్వల్ప మెజారిటీ తేడాలతో ఓడిపోయారు. కానీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే వీరి మధ్య సోమన్న గెలుపు కష్టమని చెప్పొచ్చు…కానీ ఓట్లు చీల్చడం మాత్రం గ్యారెంటీ….మరి ఓట్లు చీల్చడం వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ఎన్నికల్లో తేలుతుంది. మొత్తానికైతే తుంగతుర్తిలోనే వైఎస్సార్టీపీకి తొలి ఓటమి వచ్చిన ఆశ్చర్యపోనక్కరలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news