కరోనా కారణంగా విద్యావ్యవస్థకి ఎక్కడ లేని ఇబ్బందులు వచ్చాయి. తరగతులు జరగకుండా ఇంటి దగ్గరే ఉండడంతో పిల్లల్లోనూ మానసికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కానీ బయట పరిస్థితులు బాగా లేవు. తాజాగా తమిళనాడు ప్రభుత్వం 9,10, 11వ తరగతుల విద్యార్థులకి పరీక్షలు జరపకుండానే పాసయినట్టు ప్రకటించేసింది. కరోనా వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎమ్ పళనిస్వామి అసెంబ్లీ సాక్షిగా ఈ మాటలు అన్నారు. వైద్యులతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
9, 10, 11వ తరగతుల వారు డైరెక్టుగా పై తరగతులకి వెళ్ళవచ్చని, ఇంటర్నల్ స్కోరు ఆధారంగా మార్కులు అందిస్తామని, గ్రేడ్లు కూడా వాటి ఆధారంగానే ఉంటాయని తెలిపారు. ఇంకా, 12వ తరగతి విద్యార్థులకి మాత్రం మే 3వ తేదీ నుండి మే 22వరకు పరీక్షలు జరుపుతామని, వాటికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా కారణంగా చాలా రాష్ట్రాలు పరీక్షలు రాయకుండానే విద్యార్థులకి ప్రమోట్ చేసారు.