ప్రపంచ దేశాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న టాప్ టెన్ సిటీస్‌ను ‘ది ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ దేశాలేంటో.. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంటో తెలుసుకుందాం రండి.
లాస్ ఏంజిల్స్, యూఎస్
లాస్ ఏంజిల్స్.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే.. లాస్ ఏంజిల్స్‌లో 40 లక్షల జనాభా ఉంటుందని అంచనా. హాలీవుడ్ సినీ పరిశ్రమ ఈ నగరంలోనే ఉంది.
జ్యూరిక్, స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ ఆర్థిక రాజధాని జ్యూరిక్. వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో జ్యూరిక్ నగరానికి 103 పాయింట్లు వచ్చాయి. నివేదికల ప్రకారం.. ఈ నగరంలో నెలకి ఒక్కరికి అయ్యే ఖర్చు సుమారు 2,914 యూఎస్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.2.14 లక్షలు ఖర్చు చేస్తారు.
పారిస్, ఫ్రాన్స్
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని మాత్రమే కాదు. మంచి టూరిస్ట్ స్పాట్. వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లోనూ పారిస్‌కు 103 పాయింట్లు వచ్చాయి.
హాంకాంగ్, చైనా
చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉన్న హాంకాంగ్ ప్రపంచంలో అత్యధిక జీవన వ్యయమున్న మూడో నగరం. ఈ నగరంలో జీవించాలంటే ఒక్కరికి నెలకు కనీసం 2,624 యూఎస్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.1.93 లక్షలు ఖర్చవుతోందట.
సింగపూర్
సింగపూర్ అత్యంత ధనికులున్న దేశంగా పేరుగాంచింది. ఇక్కడ 57 లక్షల జనాభా ఉంటే.. దాదాపు 23 లక్షల మంది విదేశీయులే స్థిరపడటం విశేషం.
టెల్ అవీవ్, ఇజ్రాయిల్
ఇజ్రాయిల్‌లోని ఈ నగరం అత్యధిక జీవన వ్యయమున్న నగరాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో 101 పాయింట్లు వచ్చాయి.
ఒసాకా, జపాన్
సాంకేతిక ఆవిష్కరణలో ఎప్పుడూ ముందుంటుంది జపాన్. స్థానిక జనాభాతోపాటు ఇతర దేశస్థులు కూడా ఈ దేశంలో నివసిస్తుంటారు.
జెనీవా, స్విట్జర్లాండ్
అత్యధిక జీవన వ్యయమున్న నగరాల్లో రెండు నగరాలు స్విట్జర్లాండ్‌లోనే ఉండటం గమనార్హం. జ్యూరిక్ నగరంతోపాటు జెనీవా కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది.
న్యూయార్క్, యూఎస్
అమెరికాలో అత్యధిక జనాభా ఉన్న నగరం న్యూయార్క్. ఈ మహానగరాన్ని మినీ ప్రపంచంగా.. సంస్కృతి, ఆర్థికం, మీడియా రంగాలకు రాజధానిగా పేర్కొంటారు.
కోపెన్ హాగెన్, డెన్మార్క్
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్ ఆనంద నగరాల జాబితాలోనూ ఈ నగరం చోటు సంపాదించుకుంది. కెనాల్స్, రుచికరమైన ఆహారం, ఉద్యానవనాలకు ఈ నగరం ఫేమస్.