ఈ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి ఈ ఛార్జీలు కట్టక్కర్లేదు..!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుండి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రూ.5 లక్షల వరకు చేసుకునే ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీసు ట్రాన్సక్షన్స్ చేస్తే చార్జెస్ పే చెయ్యక్కర్లేదు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కొత్త చార్జీలు వచ్చే నెల 1 నుంచే ఐఎంపీఎస్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి.

 

బ్యాంకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ద్వారా ఐఎంపీఎస్ ఫీచర్‌ను వాడుకుంటూ రూ.5 లక్షల వరకు ట్రాన్సక్షన్స్ ని ఫ్రీ గానే జరపచ్చు. ఎలాంటి చార్జెస్ కూడా చెల్లించక్కర్లేదు. అయితే ఇది వరకు చూస్తే రూ.2 లక్షల వరకు విలువైన ఐఎంపీఎస్ లావాదేవీలను మాత్రమే కస్టమర్లకు అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ లిమిట్ ని పెంచింది. ఈ పరిమితిని రూ.5 లక్షలకు తీసుకు వచ్చింది.

డిజిటల్ బ్యాంకింగ్‌ను చేపట్టేలా ప్రోత్సహించేందుకు రూ.5 లక్షల వరకు చేసుకునే ఐఎంపీఎస్ లావాదేవీలపై ఎలాంటి చార్జెస్ కూడా విధించకూడదు అని నిర్ణయించాం అని బ్యాంక్ తెలిపింది. ఫ్రీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ద్వారా సేవలని పొందొచ్చు. బ్రాంచ్ ఛానళ్లలో మాత్రం ఐఎంపీఎస్ సర్వీసు ఛార్జీలు అలానే ఉంటాయి. బ్యాంకు బ్రాంచులలో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చేసే లావాదేవీలకు కొత్త శ్లాబును బ్యాంక్ తీసుకొచ్చింది. వచ్చే నెల 1 నుంచి రూ.20 ప్లస్ జీఎస్టీని విధించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news