వరుస విజయాలతో దూసుకుని పోతున్న బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు కానీ అడగాల్సినవి ఆయన అడగడం లేదు. అంటే ఓ ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సినంత నిలదీయడం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వానికి అవి నప్పవు కనుక! ఆ విధంగా ఆయన పెద్దగా మాట్లాడకపోవడం వల్లే హిందూపురం అభివృద్ధి పనులలో వేగం లేదని కూడా తేలిపోయింది.
ఇక ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా విజయవాడ లోక్ సభ నియోజకవర్గాన్ని ప్రకటించాక కూడా ఆయన ఇంతవరకూ ఆ విషయమై స్పందించలేదు. అంటే ఆయన సమ్మతి ఉందో లేదో అన్నది దేవుడికే ఎరుక. ఏదేమయినప్పటికీ జగన్ సర్కారు పై పెద్దగా మాట్లాడని వ్యక్తి నందమూరి బాలకృష్ణ. టీడీపీ, వైసీపీకి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నా కూడా బాలయ్య వరకూ అవేవీ పట్టింపులో ఉండవు. ఆయన కూడా అసెంబ్లీ వేదిక గా జగన్ ను ఒక్క మాట కూడా అనరు.
వైసీపీ శ్రేణులు కూడా బాలయ్య అంటే గౌరవాన్నే చూపుతాయి. అంతేకాదు మొన్నటి వేళ అఖండ సినిమాకు బాగానే మద్దతిచ్చాయి. కనుక బాలయ్య నుంచి మనం ఈ తరహా వివాదాలను ఆశించలేం. ఆయన పెద్దగా ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇకపై ఉండవు కూడా! హిందూపురంలో పర్యటించినా కూడా పైపై మాటలే కానీ పెద్దగా ఒత్తిడి తెచ్చి పనులు చేయించిన సందర్భాలు అతి తక్కువ. ఈ నేపథ్యంలో బాలయ్య గొంతు విప్పారు. ఎందుకంటే?
కొత్త జిల్లాల ఏర్పాటుపై నందమూరి బాలయ్య కూడా స్పందించారు. కూడా స్పందించారు అని ఎందుకు అంటున్నానంటే ఆయన ఇంతవరకూ పెద్దగా వాటిపై మాట్లాడలేదు కనుక! ఇక బాలయ్య కూడా తమ హిందూపురం నియోజకవర్గం గురించి మాట్లాడా రు.. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గాన్ని సత్యసాయి జిల్లాగా ప్రకటించి, హిందూపురంను జిల్లా కేంద్రంగా పరిగణించి ప్రకటన చేయాలని కోరారు.
ఈ మాట జగన్ వినిపించుకుంటారో లేదో కానీ బాలయ్య మాత్రం తనవంతు ప్రయత్నం అయితే చేశారు. ఇదంతా బాగుంది కానీ విజయవాడ లోక్ సభ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా జగన్ ప్రకటించినా కూడా బాలయ్య స్పందించలేదు. ఎందుకనో ఆయన టాపిక్ పై నిన్నటి వీడియోలో మాట్లాడనే లేదు. అంటే ఆయన ఆ ప్రకటనను స్వాగతిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అన్నది కూడా తేలలేదు.