తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ నెల 29న ఈ పిక్చర్ రిలీజ్ కానుంది. కాగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ లో మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం పట్ల కాజల్ అభిమానులు అభ్యంతరం తెలిపారు. కావాలనే అలా చేశారా? అని అడిగారు. ఆమె పాత్రకు చిత్రంలో ప్రయారిటీ లేదా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ పాత్రలను కావాలనే పరిచయం చేయలేదని, సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసం అలా చేశారని వార్తలొచ్చాయి. కాగా, తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్స్ లోనూ కాజల్ అగర్వాల్ పేరు ప్రస్తావించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఉన్నట్లా ? లేనట్లా? అనే సందేహాలు వస్తున్నాయి.
ఎడిటింగ్ లో కాజల్ అగర్వాల్ పాత్రను కంప్లీట్ గా తీసేశారా? అని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా తాజా గా దర్శకులు కొరటాల శివ, హీరో రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీస మాత్రంగానైనా కాజల్ అగర్వాల్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.
‘ఆచార్య’ సినిమాలో ‘సిద్ధ’ పాత్ర పోషించిన రామ్ చరణ్ కు జోడీగా ‘నీలాంబరి’గా నటించిన పూజా హెగ్డే గురించి దర్శకులు కొరటాల శివ, రామ్ చరణ్ మాట్లాడారు. కానీ, మెయిన్ ఫిమేల్ లీడ్ అయిన పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ గురించి కనీసంగా మాట్లాడలేదు. అయితే, వాళ్లు కావాలనే కాజల్ అగర్వాల్ పాత్ర గురించి మాట్లాడటం లేదని, పాత్ర ప్రాధాన్యత ఉన్నది కాబట్టే ట్రైలర్ లో కనిపించ లేదనే వాదన చేసే వారు కూడా ఉన్నారు. చూడాలి మరి..కాజల్ పాత్రకు ‘ఆచార్య’ ఫిల్మ్ స్టోరిలో ప్రయారిటీ ఉందా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెల 29న సినిమా విడుదలయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.