Ram Charan: రామ్ చరణ్‌ను చుట్టు ముట్టిన మహిళా అభిమానులు..RC15 వీడియో వైరల్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. RRR సినిమా విడుదలైన నేపథ్యంలో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. RC15 షూటింగ్ కోసం నార్త్ ఇండియాలో ఎక్కడికెళ్లినా అభిమానులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడుతున్నారు.

ఇటీవల RC15 ఫిల్మ్ షూటింగ్ లో భాగంగా అమృత్ సర్ కు వెళ్లిన రామ్ చరణ్ ను మహిళా అభిమానులు చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో రామ్ చరణ్ కూల్ గా మహిళా అభిమానుందరితో సెల్ఫీ దిగారు. సెక్యూరిటీ గార్డులను పక్కకు వెళ్లాలని సూచించి అందరితో చక్కగా బిహేవ్ చేశారు.

RRR ఫిల్మ్ లో చివరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజుగా ప్రొజెక్ట్ చేసిన నార్త్ ఇండియన్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. రామ్ చరణ్ ఆ పాత్రలో చివరకు రాముడిలాగా కనబడుతుండటంతో జనాలు ఫిదా అయిపోయారని సినీ అభిమానులు అంటున్నారు.

మొత్తంగా RRR సినిమాతో రామ్ చరణ్ కు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. రామ్ చరణ్ తన తండ్రితో కలిసి నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 ఫిల్మ్ పైన కూడా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news