BRS నుండి వచ్చే వారికి టికెట్ ఇచ్చేదే లేదు: ఎంపీ

-

తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ల గొడవ జరుగుతోంది, రానున్న ఎన్నికలలో BRS, కాంగ్రెస్ మరియు బీజేపీల నాయకులు టికెట్ ల కోసం అధిష్ఠానాలను బుజ్జగించే పనిలో పడ్డారు. అయినప్పటికీ కొందరికి మొండిచెయ్యి చూపడం తప్పడం లేదు అని తెలుస్తోంది. ఇక తాజాగా నకిరేకల్ లో పార్టీ నేతలతో సమావేశం అయిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం నమ్మకం కలిగిన నాయకులను వచ్చే ఎన్నికలలో అభ్యర్థులుగా నిలపడానికి ఆసక్తి చూపుతోందన్నారు. ఇక కొమటిరెడ్డి మాట్లాడుతూ అధికార BRS లో టికెట్ లు దొరకని వారంతా కూడా కాంగ్రెస్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇటువంటి వారికి కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు కోమటిరెడ్డి.

అయితే కోమటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే వేములను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేశారంటూ చర్చ జరుగుతోంది. కాగా BRS లో టికెట్ లు దక్కని వారంతా కాంగ్రెస్ లోకి వస్తారా ? వచ్చినా వారి మీద నమ్మకంతో కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news