నెలరోజుల్లో రుణమాఫీ పూర్తి చేస్తాం: హరీష్ రావు

-

తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొద్దీ రోజుల క్రితమే రైతులకు రుణమాఫీని చేయడానికి నడుం బిగించారు. అందులో భాగంగా వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరుగుతోంది. ఇక తాజాగా మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నియోగాజకవర్గం లోని రాంపూర్ లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ… ఈ రాష్ట్ర రైతులకు ఊపిరి అయిన వ్యవసాయానికి కేవలం మూడు గంటలు మాత్రమే చాలు అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల గురించి ఒకసారి మీరు అంతా ఆలోచించాలని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న రుణమాఫీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి మేము కృషి చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. ఈ రుణమాఫీ ఒక నెలరోజులలో పూర్తి చేసి , ఆ తర్వాత వడ్డీ లేని రుణాలను సైతం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతామన్నారు హరీష్ రావు.

తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం మన సీఎం కేసీఆర్ అన్ని రకాల పధకాలను మనముందుకు తీసుకువస్తూ సంక్షేమాన్ని ఒక స్థాయిలో అమలుచేస్తున్నారన్నారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news