ఇప్పటికీ వ్యాక్సిన్‌లేని వ్యాధులు.. కరోనా వ్యాక్సిన్‌ వస్తుందా?? రాకపోతే

-

కరోనా వైరస్‌ మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తూ ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉండటం భయాందోళనకు గురిచేస్తుంది. త్వరలో కరోనా వ్యాక్సిన్‌ వస్తుందంటూ ప్రచారాలు జోరుగా సాగుతున్నా ఇప్పట్లో వచ్చే విధంగా కనిపించటంలేదు. ఇప్పటికీ వ్యాక్సిన్‌లు లేని వైరస్‌లు ఉన్నాయి.

మొట్టమెదటిసారిగా 1984లో హెచ్‌ఐవీ వైరస్‌ బయటపడింది. ఇప్పటికి 36 సంవత్సరాలు పూర్తయినా వ్యాక్సిన్‌ మాత్రం కనిపెట్టలేకపోయాం. ఈవ్యాధి బారినపడి ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్లమందికి పైగా మరణించారు. 1997లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్‌ క్లింటన్‌ మరో పది సంవత్సరాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆ పది సంవత్సరాలు గడచి మరో 13 సంవత్సరాలైన వ్యాక్సిన్‌ రాలేదు. ఇంకా ప్రపంచం హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తూనే ఉంది.

ఒక్క హెచ్‌ఐవీకే కాదు.. డెంగీ వైరస్‌, అతి ప్రమాదకరమైన రైనో వైరస్‌, అడెనో వైరస్‌లకు కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్‌ లేదు. వీటన్నింటికీ భిన్నమైనది ప్రపంచానికి అత్యంత ప్రమాదకారి కరోనా వైరస్‌. ఇప్పటికే వందకు పైగా ఫార్మా కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో ఉన్నాయి. చైనా నుండి సైనోవాక్‌, కాన్‌సినో సంస్థలు , అమెరికా నుండి మోడెర్నా కంపెనీ ముందు వరుసలో ఉన్నాయి. ఇంకా కొన్ని సంస్థలు ఫలితాన్ని రాబట్టే క్రమంలో కసరత్తులు చేస్తున్నాయి..

ఒకవేళ కరోనాకు వ్యాక్సిన్‌ రాకపోతే.. ఏం చెయ్యాలన్నది ముఖ్యం. కరోనా వ్యాప్తి చూస్తే మనషి సాధారణ పరిస్థితులకి రావడం ఇప్పట్లో కష్టం అలాంటి పరిస్థితిల్లో కరోనాను అదుపు చేసే మార్గాలపై దృష్టి పెట్టాలి. నిర్విరామ లాక్‌డౌన్‌లతో ప్రపంచదేశాల ఆర్థిక పరిస్థితులు పాతాళానికి పడిపోతాయి. వ్యాధిని అదుపుచేసేందుకు సరైన ప్రణాళికలు అమలు పరచాలి..

  • ముందుగా ప్రజలందరూ మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.
  • కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా చికిత్స చేయించుకునేందుకు ముందుకురావాలి.
  • మనం పోరాడాల్సింది వ్యాదితో , రోగితో కాదు.. వారిని వెలివేసినట్లు చూడకుండా అభినందించేలా ఉండాలి.
  • వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, మాస్కులను విధిగా ధరించడం చెయ్యాలి..
  • సమాజిక దూరం తప్పనిసరిగా పాటించడం మరవద్దు..

రానున్న రోజులు కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయి.. దానికి గాను ప్రజలందరం మానసికంగా సిద్ధమవ్వాలి.

క‌రోనా వైర‌స్ లేదా కొవిడ్ -19తో ఈ రోజు దేశం మొత్తం యుద్ధం చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మ‌నం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. వారిని వివ‌క్ష‌తో చూడ‌కండి. వారిని ప‌రిర‌క్షించండి. ఈ వ్యాధుల నుంచి కాపాడేందుకు ర‌క్ష‌క క‌వ‌చాలు ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అధికారుల‌ను గౌర‌వించండి. వారికి స‌హ‌క‌రించండి. ఈ ర‌క్ష‌క క‌వ‌చాల‌ను ప‌రిర‌క్షిద్దాం. క‌రోనా వైర‌స్ నుంచి దేశాన్ని గెలిపిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news