షాకింగ్: వ్యాక్సిన్ కంపెనీల మీద కిమ్ జోంగ్ ఉన్ దాడులు

-

యుఎస్, యుకె మరియు దక్షిణ కొరియాలో తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కంపెనీల మీద ఉత్తర కొరియా దాడులకు దిగింది. వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న ఆరు కంపెనీలు సహా 9 ఆరోగ్య సంస్థల వ్యవస్థల్లోకి ప్రవేశించడానికి ఉత్తర కొరియా హ్యాకర్లు ఇటీవల ప్రయత్నాలు చేసారు అని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అమెరికాకు చెందిన జాన్సన్ & జాన్సన్ మరియు నోవావాక్స్ ఇంక్, రెండూ ప్రయోగాత్మక వ్యాక్సిన్ల కంపెనీలపై దాడులకు దిగింది.

ఆస్ట్రాజెనెకాను హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేయగా గుర్తించారు. ఇది తయారు చేస్తున్న వ్యాక్సిన్ 90% ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. మూడు దక్షిణ కొరియా కంపెనీలు… జెనెక్సిన్ ఇంక్, బోరుంగ్ ఫార్మా కో లిమిటెడ్, షిన్ పూంగ్ ఫార్మ్ కో లిమిటెడ్ మరియు సెల్ట్రియన్ ఇంక్ ల మీద కూడా హ్యాకర్లు దాడులు చేసి వారి వారి సాఫ్ట్ వేర్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసారు. బోస్టన్‌ లోని బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్ మరియు జర్మనీలోని ట్యూబిన్జెన్ విశ్వవిద్యాలయం కూడా ఆ దేశ టార్గెట్ లో ఉన్నాయి. ఉపయోగకరమైన సమాచారాన్ని వాళ్ళు హ్యాక్ చేసారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news