మరోసారి బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా

-

ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఖండాతర క్షిపణులను పరీక్షించి ఉద్రిక్తతలను రాజేసింది. తూర్పు తీర సముద్ర జలాల్లోకి కిమ్ సేన రెండు బాలిస్టిక్‌ క్షిపణలును ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఈ విషయాన్ని జపాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.

జపాన్‌, కొరియా ద్వీపకల్పానికి మధ్య ఉన్న సముద్ర జలాల్లో ఆ బాలిస్టిక్‌ క్షిపణి పడినట్లు జపాన్‌ ఆరోపించింది. ఉత్తరకొరియా వాయువ్య ప్రాంతంలోని టాంగ్‌చాంగ్రి నుంచి 50 నిమిషాల వ్యవధిలో ఈ క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది. ఈ క్షిపణులు సుమారు 500 నుంచి 550 కిలోమీటర్లు మేర ప్రయాణించినట్లు తెలిపింది. జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపల పడినట్లు స్పష్టం చేసింది. తమకు వ్యతిరేకంగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు ఏవైనా చర్యలకు పాల్పడితే అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామని ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడం ఉద్రిక్తలకు దారి తీసింది.

Read more RELATED
Recommended to you

Latest news