మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అన్నారు మంత్రి హరీష్ రావు.తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం గా మారిపోయిందని చెప్పారు.జీఎస్ డిపి లో తెలంగాణ వృద్ధి సాధించిందని వివరించారు.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు.నగరంలోని మాదాపూర్ లో తెరాస ప్లీనరీ సందర్భంగా అక్కడికి బయలుదేరేముందు హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.12, 13 రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణకు వస్తున్నారని తెలిపారు.డబుల్ ఇంజన్ ఉన్న యూపీ నుంచి తెలంగాణకు వలస వస్తున్నారని అన్నారు.
జాతీయ రాజకీయాల్లో తెరాస పాత్ర పై చర్చిస్తామని చెప్పారు.బండి సంజయ్ పాదయాత్ర ప్రజలు లేక వెలవెలబోతున్నదని , దేశంలో నిరుద్యోగులకు, రైతులకు బిజెపి చేసిందేమీ లేదని ఆరోపించారు.తెలంగాణ కంటే భాజపా ఏ రాష్ట్ర పాలిత ప్రాంతం బాగుందని ప్రశ్నించారు.బిజెపి హయాంలో అచ్చే దిన్ కాదు సచ్చే దిన్ వచ్చాయని ఎద్దేవా చేశారు.ప్రశాంత్ కిషోర్ బీజేపీతో ఉంటే గొప్పోడు..మాతో ఉంటే తప్పా అని ప్రశ్నించారు.మా పనితీరు బాగుంది..అందుకే పీకే ను తీసుకున్నామని హరీష్ అన్నారు.