రామారావు కాదు.. డ్రామారావు అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. తాజాగా ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా రామారావు డ్రామాలు ఆపాలన్నారు. కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణకు రావడానికి నాటకాలు ఆడుతున్నాడని తెలిపారు. కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి. విదేశాలకు పారిపోడని గ్యారెంటీ ఏంటి..? అని ప్రశ్నించారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఫార్ములా ఈ కేసు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గ్రీన్ కో ఆఫీస్ కు వచ్చారు ముగ్గురు తెలంగాణ ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో పార్ట్ నర్ గా గ్రీ కో కంపెనీ ఉన్నట్టు అనుమానంతో సోదాలు చేపడుతున్నారు. గ్రీన్ కో సంస్త ద్వారా బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల లబ్ధి చేకూరినట్టు వెల్లడించింది.