షెడ్యూల్ ప్రకారం చెన్నై ఆడుతుందో లేదో తెలీదు: గంగూలీ

-

చెన్నై సూపర్ కింగ్స్ లో కొందరికి కరోనా రావడంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎట్టకేలకు స్పందించారు. గత వారం ప్రారంభంలో, చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన 13 మంది సిబ్బంది కరోనా బారిన పడటంతో అసలు చెన్నై ఐపిఎల్ ఆడుతుందా లేదా అనే అనుమానం కలిగింది. బౌలర్ దీపక్ చాహర్, బ్యాట్స్ మాన్ రితురాజ్ గైక్వాడ్ లకు కరోన నిర్ధారణ అయింది.

వారు దుబాయ్ చేరుకున్న 3 వ రోజునే 13 మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీనిపై మాట్లాడిన గంగూలీ… “నేను చెన్నై పరిస్థితిపై ఏమీ మాట్లాడలేను. షెడ్యూల్ ప్రకారం వాళ్ళు లీగ్ లో ఆడతారా లేదా అనేది మేము పరిశీలిస్తాం. ఐపీఎల్ బాగా జరుగుతుందని… నేను ఆశిస్తున్నా. టోర్నమెంట్ కోసం మాకు సుదీర్ఘ షెడ్యూల్ ఉంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నా అని గంగూలీ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news