రాజ్యసభలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించాలని టీఆర్ఎస్ ఎంపీల నోటీసులు

-

న్యూఢిల్లీ: రాజ్యసభలో బాయిల్డ్ రైస్ కొనుగోళ్ల పై చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ ఎంపీల నోటీసులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ మార్కెట్ యార్డుల్లోనే ఉందని నోటీసుల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, రూల్ 267 ప్రకారం ఇతర బిజినెస్ ఆపివేసి , బాయిల్డ్ రైస్ పై చర్చించాలని ఎంపీల నోటీసులు ఇచ్చారు. బాయిల్డ్ రైస్ కొనుగోళ్ల పై తెలంగాణ రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని కోరారు. కాగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పై నిన్న సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. “పారా బా యిల్డ్ రైస్” ఎగుమతులు విషయంలో సభను తప్పుదోవ పట్టించారని.. రాజ్య సభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు కు నోటీసులు ఇచ్చారు. సభను తప్పుదోవ పట్టించారని కేంద్ర మంత్రి కి వ్యతిరేకంగా రాజ్యసభ లో 187 నిబంధన కింద “ప్రివేలేజ్ మోషన్ నోటీస్” ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news