పెన్షన్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు మరెంత ఈజీ..!

-

ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన మనం చక్కటి లాభాలను పొందొచ్చు. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన కూడ ఒకటి. ఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లో ఏపీవై అకౌంట్‌ను తెరుచుకునే అవకాశాన్ని ఇస్తున్నట్టు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ తెలిపింది.

money
money

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆన్‌లైన్‌లో ఏపీవై అకౌంట్‌ను ఓపెన్ చెయ్యాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాలి. కానీ బ్యాంకు బ్రాంచుకు వెళ్లాల్సినవసరం లేదు. డిజిటల్ ఎన్‌రోల్‌మెంట్‌ను ఈ-ఏపీవై ఆఫర్ చేస్తుంది. మీ సమయాన్ని, ఖర్చులను ఆదా చేస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారు వయసు మళ్లిన తర్వాత ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని దీనిని తీసుకొచ్చారు.

ఇప్పటి వరకు ఫిజికల్‌గా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర డిజిటల్ విధానాల ద్వారా ఈ స్కీమ్ కింద ఎన్‌రోల్ అవ్వాల్సి ఉండేది. కానీ ఈ అకౌంట్ల సబ్‌స్క్రిప్షన్ మరింత పెంచేందుకు… ఈ ప్రాసెస్ ని ఈజీ చేసేందుకు ఈ-ఏపీవైను అందిస్తున్నారు. ఈ స్కీమ్ లో ఆధార్ ఈ-కేవైసీ/ఎక్స్‌ఎంఎల్ ద్వారా చేరచ్చు. ఈ-ఏపీవై లేదా ఈ-కేవైసీ/ఎక్స్‌ఎంఎల్ ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో డెమొగ్రాఫిక్ సమాచారాన్ని ఇవ్వాలి.

ఏపీవై కంట్రిబ్యూషన్ తొలి వాయిదా కింద కట్టాల్సిన డబ్బులు సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌లో ఉండాలి. రూ.1000 నుంచి రూ.5000 మొత్తానికి ఈ పెన్షన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఎలా రిజిస్టర్ చెయ్యాలి అన్నది చూస్తే..

ఏపీవై సబ్‌స్క్రయిబర్ రిజిస్ట్రేషన్ https://enps.nsdl.com/eNPS/ApySubRegistration.html కి వెళ్లాలి. నెక్స్ట్ బ్యాంకును ఎంపిక చేసుకుని అకౌంట్ వివరాలు మొదలైన వివరాలని ఇవ్వాలి. ఎక్స్‌ఎంఎల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయాలి. పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ కోసం కోడ్ వచ్చాక యాడ్ చేసి, క్యాప్చాను నమోదు చేసి, కంటిన్యూను నొక్కాలి అంతే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news