ఎన్టీఆర్ కాషాయాన్ని ధరించడం వెనక అసలు స్టోరీ తెలుసా…?

-

తెలుగు జాతి గొప్పతనాన్ని నలుదిశలా వ్యాప్తి చెందించిన మహా నేత నందమూరి తారకరామారావు. సినీ నటుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. పౌరానికం, జానపదం, సాంఘికం సినిమా ఏదైనా అవలీలగా పాత్రలు పోషించిన మహానటుడు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు ఇలా ఏ వేషం వేసినా నిజంగా దేవుడు దిగివచ్చాడా అని అనుకునేంతగా సమ్మోహన రూపాన్ని కలిగి ఉండటం ఒక్క ఎన్టీఆర్ కే సొంతం.

సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశాన్ని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకువచ్చారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న కొన్ని పథకాలకు ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే స్ఫూర్తినిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఒకసారి తిరుపతిలో జరిగిన ఓ సినిమా కార్యక్రమానికి పూర్తిగా కాషాయ దుస్తులతో ఎన్టీఆర్ వచ్చారు. ఈ కొత్త వేషధారణను చూసిన చాలా మంది షాక్ అయ్యారు. అయితే చాలామంది ఎన్టీఆర్ ను కాషాయం ఎందుకు ధరించారని అడగాలనుకున్నా.. భయపడి అడగలేదు. విలేకరులు కాషాయం గురించి ప్రశ్నించగా… దాంతో ఎన్టీఆర్….కాషానికి మార‌డాన్ని స‌న్య‌సించ‌డం అని అభివ‌ర్ణించారు. ప్రాపంచిక సుఖాల‌కు అల‌వాటు ప‌డ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా అని అందుకే ఈ గెట‌ప్ అని చెప్పారు. ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిని చెరిచిన ఘ‌ట‌న త‌న‌ను క‌ల‌చివేసింద‌ని జీవితం ప‌ట్ల విర‌క్తి పుట్టింద‌ని వ్యాఖ్యానించారు.

అయితే ఎన్టీఆర్ కాషాయం ధరించడం వెనక మరో వ్యక్తి కూడా ఉన్నారు. ప్రముఖ మానవహక్కుల ఉద్యమకారుడు స్వామీ అగ్నివేష్ స్ఫూర్తితోనే ఎన్టీఆర్ కాషాయం ధరించం మొదలుపెట్టారట. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో స్వామీ అగ్నివేష్ హైదరాబాద్ కు వచ్చారు. ఆ సయమంలో కాషాయ గొప్పతనం గురించి ఎన్టీఆర్ కు, స్వామి అగ్నివేష్ వివరించారు. దీంతో అప్పటి నుంచి కాషాయాన్ని ధరించడం ప్రారంభించారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ వేషధారణను కేవలం డ్రామాలుగా కొట్టిపారేసింది కాంగ్రెస్ పార్టీ.

 

Read more RELATED
Recommended to you

Latest news