ఆ సినిమాతో నయా ట్రెండ్ సెట్ చేసిన ఎన్టీఆర్..!

-

సీనియర్ ఎన్టీఆర్.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. సాంఘీక, పౌరాణిక, జానపద సినిమాల్లో ఆయన పోషించిన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా మాత్రం నయా ట్రెండ్ సెట్ చేసింది. అప్పటి వరకు పౌరాణిక పాత్రలు శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు పాత్రలు పోషించిన సీనియర్ ఎన్టీఆర్.. ఆ మూవీ తో స్టైల్ కా బాప్ అయిపోయారు. ఆ సినిమా ఏంటి? ఆ మూవీ దర్శకుడు ఎవరు అనే విషయాలు ఇవాళ తెలుసుకుందాం.

వెండితెరపైన సీనియర్ ఎన్టీఆర్ కనబడగానే తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రియులు ఆనంద పడిపోతుంటారు. వెండితెరను ఏలిన రారాజు ఎన్టీఆర్ అని కొనియాడుతుంటారు. విలక్షణ మైన పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘అడవి రాముడు’ చిత్రంలో సరి కొత్త అవతారంలో చూపించారు.

సత్యనారాయణ, సూర్యనారాయణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన ఈ పిక్చర్ లో హీరోయిన్స్ గా జయసుధ, జయప్రద నటించారు. ఇక ఇందులో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట ఇప్పటికీ జనాల ఫేవరెట్ సాంగ్ గా ఉంది. ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. అప్పటి వరకు వచ్చిన ఎన్టీఆర్ చిత్రాలన్నిటిలో ‘అడవి రాముడు’ డిఫరెంట్ మావీగా నిలిచింది. ఈ చిత్రంతో కమర్షియల్ ఫార్ములా స్టార్ట్ అయిందని సినీ పరిశీలకులు చెప్తుంటారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సీనియర్ ఎన్టీఆర్ ను ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా చూపించారు. ఈ పిక్చర్ చేసే నాటికి ఎన్టీఆర్ వయసు ఐదు పదులు దాటినప్పటికీ ..మూవీలో పాతికేళ్ల కుర్రాడిలాగానే కనబడ్డారని సినీ ప్రియులు చెప్పుకున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ధరించిన బట్టలు చూసి అప్పటి యూత్ ఫిదా అయిపోయింది. సేమ్ ఎన్టీఆర్ స్టైల్ డ్రెస్సింగ్ చేసుకున్నారు యువకులు. ఎన్టీఆర్ వేసుకున్న సూట్ లు, బూట్ కట్ ప్యాంట్స్ కు గిరాకీ కూడా పెరిగింది. అలా చాలా కాలం పాటు బూట్ కట్ ప్యాంట్స్ ట్రెండ్ నడిచింది. మొత్తంగా సీనియర్ ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ చిత్రంతో అప్పటి వరకు ఉన్న ట్రెండ్ ను మార్చి నయా ట్రెండ్ సెట్ చేశాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news