మోడీ సర్కార్‌కు షాక్‌ : కేంద్రంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

-

మోడీ సర్కార్‌ కు మరోసారి దేశ ఉన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ట్రైబ్యునళ్ల లో ఖాళీలు మరియు నియామకాల పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్ల లో ఉన్నటు వంటి నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు తీర్పులు మరియు ఉత్తర్వులను గౌరవించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మా సహనాన్ని పరీక్షిస్తున్నారా ? అని నిలదీశారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. చిన్న కేసులనూ ఏళ్ల తరబడి వాయిదా వేయాల్సి వస్తోందని నిప్పులు చెరిగారు. ట్రైబ్యునళ్ల వ్యవహరంలో మూడు ఆప్షన్లు మాత్రమే మిగిలాయని… ఆయన పేర్కొన్నారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.   కేంద్రం తెచ్చిన చట్టం పై స్టే ఇవ్వడం ఒక ఆప్షన్‌ అని,,, ట్రైబ్యునళ్లు రద్దు చేసి హై కోర్టుకు అధికారాలివ్వడం రెండోదన్నారు. అలాగే… కేంద్రం పై ధిక్కరణ చర్యలు చేపట్టడం మూడో ఆప్షన్‌ అని గుర్తు చేశారు. ఈ కేసును ఈనెల13 కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు.. ఆలోపైనే కేంద్రం లో మార్పు రావాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news