Akhil Akkineni: మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన అఖిల్..! ఆ కోరిక‌ను తీర్చేవారెవ‌రో?

-

Akhil Akkineni: ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్స్ తెర‌కెక్కాయి. వీటిలో స్పోర్ట్‌ స్టార్స్ బయోపిక్స్‌కు ఆదార‌ణ చాలా బాగా ఉంటుంది. అందులోనూ.. క్రికెటర్స్ బయోపిక్స్ అంటే.. క్రేజ్ మాములుగా ఉండ‌దు. ఆ సినిమాలు క‌చ్చితంగా సూప‌ర్ బూప‌ర్ హిట్టే.. ఇప్ప‌టికే.. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ల బ‌యోపిక్ లు స‌క్సెస్ సాధించాయి.

ఇక కపిల్‌ దేవ్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని ఇండియా విక్టరీ 83 పేరుతో సినిమాను రూపొందించారు. ఇటీవ‌లే యువ‌రాజ్ సింగ్ బ‌యోపిక్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక టీమిండియా కెప్టెన్,
రన్నింగ్‌ మిషెన్ విరాట్‌ కోహ్లీపై బయోపిక్ రాబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. అక్కినేని అఖిల్ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కె బయోపిక్ చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఎంతో మంది జీవితాలను ప్ర‌భావ‌తం చేసిన విరాట్ కోహ్లీ బయోపిక్ తెరకెక్కితే.. ఆ సినిమాలో తాను నటించేందుకు రెడీగా ఉన్నానని అఖిల్ అన్నాడు. క్రికెట్ మీద అతడికున్న ఫ్యాషన్ తో సినిమా తీస్తే.. చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని, నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.

హీరో అఖిల్ చాలా మంచి క్రికెటర్‌. సినిమాల్లోకి వ‌చ్చే ముందు క్రికెట్‌లో స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ త‌రపున సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మ‌రి అఖిల్ కోరిక‌ను ఏ నిర్మాత తీరుస్తాడో వేచి చూడాలి.

ఇప్ప‌టికి వ‌ర‌కూ స‌రైన స‌క్సెస్ అందుకోలేని అఖిల్ .. తాజాగా ఆయ‌న న‌టించిన‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాపైనే ఆశ‌ల‌ను ప‌ట్టుకున్నాడు. ఈ చిత్రం నెల 15న విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రం ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ త‌ర్వాత అఖిల్ ..సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ‘ఏజెంట్‌’ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్‌గా న‌టిస్తున్నారు. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news