BREAKING : శ్రీవాణి టికెట్ల జారీలో ఎయిర్‌పోర్ట్‌ అధికారుల చేతివాటం

-

భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఎయిర్ పోర్టులో శ్రీవారి దర్శనం టికెట్ల కౌంటర్ ఏర్పాటు చేసింది టీటీడీ. అయితే.. శ్రీవాణి టిక్కెట్ల జారీలో తిరుపతి ఎయిర్‌పోర్టు అధికారి చేతివాటం ప్రదర్శించారు. బోర్డింగ్‌ పాస్‌ ఉన్న ప్రయాణికులకు టీటీడీ శ్రీవాణి టిక్కెట్లు ఇస్తోంది. నకిలీ పాసులతో ఐదుగురికి ఎయిర్‌పోర్ట్‌ అధికారి టిక్కెట్లు ఇప్పించాడు. అయితే టీటీడీ విజిలెన్స్‌ సోదాల్లో నకిలీ బోర్డింగ్‌ పాసుల వ్యవహారం బయటపడింది. శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ ను టీటీడీ పున:ప్రారంభించింది. తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ అవుతుండడంతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే.

అయితే భక్తుల నుంచి వస్తున్న విజ్ఞాపనలు మేరకు తిరిగి తిరుమలలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టిక్కెట్లు కేటాయింపుని ప్రారంభించింది. కాగా… టిక్కెట్ల కోటాను టీటీడీ భారీగా కుదించింది. గతంలో నిత్యం రెండున్నర వేల టిక్కెట్లను జారీ చేయగా.. ప్రస్తుతం రోజుకు రూ.150 టిక్కెట్లకు మాత్రమే పరిమితం చేసింది. మార్చి 1 నుంచి రోజూ 400 టిక్కెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం నిత్యం 250 టిక్కెట్లను కేటాయిస్తుండగా.. నేటి నుంచి వాటిని 100 టికెట్లకు మాత్రమే కుదిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news