ఈరోజుల్లో స్పెర్మ్ డోనెట్ చేయడం గురించి మీరు వినే ఉంటారు. ఇది చాలా దేశాల్లో చట్టబద్ధమే.. అయితే ఆస్ట్రేలియాలో(Australia) ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 60 మంది పిల్లలకు ఒకే వ్యక్తి తండ్రి అయ్యాడు. LGBTQ+ కమ్యూనిటీకి చెందిన తల్లిదండ్రులు ఓ పార్టీలో కలిసినప్పుడు ఒకరిద్దరు కాదు చాలామంది పిల్లలు ఒకే పోలికలతో కనిపించారు. ఇది చూసిన ఆ చిన్నారుల తల్లిదండ్రులకు మైండ్ పోయింది.. చాలామంది పిల్లలు ఒకేలా ఉండటంతో వాళ్లకు అనుమానం వచ్చింది.
ఒక స్పెర్మ్ దాత LGBTQ+ కమ్యూనిటీలోని చాలా మంది సభ్యులకు స్పెర్మ్‌ను దానం చేశారు. సాధారణంగా ఇది సాధ్యం కాదు. రూల్ ప్రకారం ఒక సమయంలో ఒక దాత ఒక్క స్పెర్మ్ మాత్రమే ఉపయోగించాలి. కానీ అతను నాలుగు వేర్వేరు పేర్లు పెట్టి చాలా మంది తల్లిదండ్రులకు స్పెర్మ్ దానం చేశాడు. పిల్లలు పుట్టే వరకు అంతా బాగానే ఉంది, కానీ అందరూ గెట్ టుగెదర్ పార్టీలో కలుసుకోవడంతో తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. ఈ కుటుంబాల మధ్య ఎటువంటి సుదూర సంబంధాలు లేవు.. అయినప్పటికీ 60 మంది పిల్లలు ఒకే రూపాన్ని పోలి ఉన్నారు.
అసలు విషయం ఇదే..
LGBTQ+ కమ్యూనిటీకి చెందిన 60 జంటలు IVF టెక్నాలజీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. ఒకే స్పెర్మ్ డోనర్ వేర్వేరు ఆసుపత్రుల్లో స్పెర్మ్ దానం చేసినట్లు తేలింది. అన్ని చోట్లా తన పేరు వేర్వేరుగా చెప్పాడు. సిడ్నీకి చెందిన ఫెర్టిలిటీ ఫస్ట్‌కి చెందిన డాక్టర్ అన్నీ క్లార్క్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆ వ్యక్తి తమ క్లినిక్‌లో ఒక్కసారి మాత్రమే స్పెర్మ్‌ను దానం చేశాడని. తర్వాత అతను అనధికారిక పద్ధతుల ద్వారా ఇతరులకు స్పెర్మ్ డొనేట్ చేశాడని తెలిపారు.. అతను రెండు ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రకటనలు ఇస్తూ ప్రజలను చిక్కుల్లో పడేశాడు. స్పెర్మ్ డొనేషన్‌లో మోసం ఆస్ట్రేలియాలో చట్టవిరుద్ధం. ఇలాంటి కేసుల్లో నిందితుడికి నేరం రుజువైతే 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉంది. అసలు ఆ వ్యక్తి అంతలా ఎందుకు డొనేట్ చేశాడనే విషయం కూడా ఇంకా తెలియరాలేదు..