Sharwanand: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ గత ఏడాది మొదట్లో శ్రీకారం సినిమాతో ముందుకు వచ్చిన శర్వానంద్‌.. మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన… మహా సముద్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పర్వాలేదనిపించాడు. అలాగే… ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం యావరేజ్ హిట్ అయింది. అయితే.. శర్వానంద్‌ హీరోగా శ్రీకార్తీక్‌ డైరెక్షన్‌లో మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది.


ఈ మూవీలో హీరోయిన్‌గా పెళ్లి చూపులు ఫేం.. రీతూ వర్మ నటిస్తోంది. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి అమల గారు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమాను సెప్టెంబర్ 9 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news