ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలిపై అత్యాచారం చేసిన యువకుడు

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసిన.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న పెద్దా అనే వయో భేదం లేకుండా ప్రవర్తించాడో.. యువకుడు.. ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలిపై అత్యాచారం చేశాడో యువకుడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి లక్ష్ణణచాంద మండలానికి చెందిన ఓ 58సంవత్సరాల వృద్ధురాలు మందుల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రోగుల వెయిటింగ్‌ హాలులోని బెంచీపై పడుకుంది.

India in shock over 86-year-old grandmother's rape - BBC News

వృద్ధురాలి నిస్సహాయస్థితిని గమనించిన శ్రీకాంత్‌ అనే 23ఏళ్ల యువకుడు ఆమె దగ్గరకు వెళ్లి మందులు ఇప్పిస్తాను రమ్మని తీసుకెళ్లాడు. వృద్ధురాలిని మరో గదిలోకి తీసుకెళ్లి అత్యాచారంకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో వైద్యసిబ్బంది ఎవరూ లేకపోవడం, కామాంధుడు వృద్ధురాలి నోరు మూసివేయడంతో ఆమె అరుపులు ఎవరికి వినిపించలేదు. అత్యాచారానికి ఒడిగట్టిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో ఆసుపత్రికి వచ్చిన మరికొందరు ఆమె దగ్గరకు చేరుకున్నారు. బాధితురాలు జరిగిన విషయాన్ని వారితో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు పోలీసులు.