జైలు నుంచి ఓల్డ్‌సిటీ గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్ విడుదల

-

పాతబస్తీ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. నకిలీ పాస్‌పోర్టు కేసులో అయూబ్ అరెస్టయ్యాడు. నకిలీ పాస్‌పోర్టుతో సౌదీ అరేబియా నుంచి వచ్చాడనే కారణంతో 2017లో అతడిని ముంబయి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం అయూబ్‌ను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

అయూబ్‌కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా.. సుమారు ఐదేళ్లుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అతడిపై పాతబస్తీ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2010లో హైదరాబాద్‌లోని గోల్కొండ చిరునామాతో నకిలీ పాస్‌పోర్టును అయూబ్‌ఖాన్‌ తీసుకున్నాడు. దీనికి సహకరించిన అతడి భార్య హఫీజా బేగం, మరో ఇద్దరు ఖాజీలను కాలాపత్తర్‌ పోలీసులు గతంలో అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news