ఇటలీ అద్భుతమైన దేశం. అక్కడ నగరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతీ నగరానికి ఐదారు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అలాంటి నగరంలోని ఇండ్లు చాలా చక్కగా, పార్కులతో కూడుకుని అందంగా ఉంటాయి. ఐతే కొన్ని నగరాల్లో రకరకాల సమస్యలు వచ్చి, డబ్బులు లేక, బ్రతకడానికి కష్టమై ఆ నగరాలను వదిలేసి వెళ్ళారు. అలా చాలా నగరాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఒక్క మనిషి లేడు. కానీ ఆ నగరాలన్ను చూస్తుంటే ఇప్పటికీ ఎంతో అందంగా ఉంటాయి.
అందువల్ల ఇటలీ ప్రభుత్వం, ఆ నగరాల్లో జనాభా పెరగాలని చూస్తుంది. అందుకని ఆ నగరాల్లోని ఇండ్లని అమ్మడానికి చూస్తుంది. అది కుడా కేవలం ఒక్క యూరోకి మాత్రమే. ఒక్క యూరో పెట్టి ఒక ఇల్లు కొనవచ్చు. ఒక యూరో అంటే మన కరెన్సీలో 85రూపాయలు. ఈ ఇళ్ళని ఎవరైనా కొనుక్కోవచ్చు. కాకపోతే ఆ ఇళ్ళని పునర్నిర్మాణం చేస్తామని మాటివ్వాలి. డిపాజిట్ గా 25వేలు, 50వేలు పెట్టాల్సి ఉంటుంది. నిర్మాణ సమయంలో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. కొన్ని నగరాల్లో డిపాజిట్ కూడా తీసుకోవడం లేదు.
పునర్నిర్మాణానికి 1-3సంవత్సరాల సమయం ఇస్తారు. ప్రతీ నగరానికి ఒక ఆర్కిటెక్ట్ ఉంటారు. మీరు వారినే నియమించుకోవాలి. ఎందుకంటే అవన్నీ పాత ఇండ్లు. వాటి పురాతన అందం పోకుండా ఉండడానికి అలా చేస్తారు. ఇంకోటి ఏంటంటే, అవన్నీ 500సంవత్సరాల క్రితం నాటివి. అందుకని ఒక చిన్న ఇల్లుని రిపేరు చేయడానికి 25లక్షల దాకా ఖర్చు అవుతుంది. మీరు కావాలంటే ఒక నగరం మొత్తాన్ని కొనుక్కోవచ్చు. అక్కడ ఏమున్నా అది మీ సొంతం అయిపోతుంది.
మీరొక్కరే కాకుండా మీ స్నేహితులందరూ కొనుక్కుని రిపేరు చేయిస్తే ఇటలీలో మీకో సొంత నగరం ఉన్నట్టే. ప్రస్తుతం 11నగరాలు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. వాటి పేర్లు.. ముసుమెలి,
కాస్ట్రాపెగ్నానా, ఒల్లల్లాయ్, ట్రాయ్నా, గాంగి, బెకారి, సంభోకం, లసన్నా, సింక్ ఫ్రాండి మొదలగునవి.